ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Accident: పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

By

Published : Apr 2, 2022, 9:59 AM IST

Accident: ఉగాది పండుగ రోజే.. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Four killed in road accident
పండుగపూట విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Accident: ఉగాది పండుగ రోజే.. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని కబళించింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు.

నేరేడుచర్లకు చెందిన ఐదుగురు కడప నుంచి వస్తుండగా మార్గమధ్యలోనే కారు ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కాగా.. తీవ్రగాయాలైన మరో వ్యక్తిని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రైవేటు బస్సులో 10 కిలోల బంగారం, 5.06 కోట్ల నగదు.. సీజ్ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details