ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వారిద్దరూ కలిసి దొంగతనాలు చేశారు, వాటాలో తేడా వచ్చి

By

Published : Aug 16, 2022, 7:36 PM IST

ELDER BROTHER KILLED YOUNGER BROTHER వాళ్లిద్దరూ కలిసి దొంగతనాలు చేసేవారు. అలా దొంగతనం చేసిన డబ్బులు మొదటి వ్యక్తి దాచిపెట్టేవాడు. అలా కొన్ని రోజులు వారి దొంగతనాలు సజావుగా సాగాయి. ఇప్పటివరకు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని రెండో వ్యక్తి పట్టుబట్టడంతో గొడవ మొదలైంది. అసలే తాగిన మైకంలో ఉన్న వ్యక్తికి చిర్రెత్తుకొచ్చి అతడిని నిర్ధాక్ష్యిణంగా హత్యచేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి వెనుక గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. అయితే ఆ వ్యక్తి హత్య చేసింది ఎవరినో కాదు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లాలో వెలుగు చూసింది.

ELDER BROTHER KILLED YOUNGER BROTHER
ELDER BROTHER KILLED YOUNGER BROTHER

MURDER: జీవితంలో అండగా ఉండాల్సిన అన్న.. తమ్ముడికి ఆపద తలపెట్టాడు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి తోడబుట్టిన వాడిని కానరాని లోకాలకు పంపించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఇంటి వెనుక ఉన్న స్థలంలో పూడ్చిపెట్టాడు.అయితే సోదరి ఫిర్యాదుతో.. దర్యాప్తు జరిపిన పోలీసులకు హత్యకు గల కారణం తెలుసుకుని అవాక్కయ్యారు.

పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 'బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలోని ద్రోణాదుల యానాది కాలనీకి చెందిన నాగులూరి గాంధీ (27)ని.. అతడి అన్న చెన్నకేశవులు మద్యం మత్తులో కొడవలితో గొంతుకోసి హత్య చేశాడు. గాంధీ, చెన్నకేశవులు ఇద్దరూ కలిసి దొంగతనాలు చేసేవారు. అలా సంపాదించిన మొత్తాన్ని తన అన్న చెన్నకేశవుల దగ్గర ఉంచుకోవడంతో.. గాంధీకి అవసరం అయినప్పుడు డబ్బులు అడగడానికి కూడా ఇబ్బందిగా ఉండటంతో.. రావలసిన డబ్బులు మొత్తం ఇవ్వమని అడిగాడు. దాంతో మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. తాగిన మైకంలో అన్న.. తమ్ముడిని కత్తితో గొంతుకోసి చంపి, మృతదేహాన్ని తమ ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు' అని మార్టూరు సీఐ ఆంజనేయ రెడ్డి వెల్లడించారు.

పూడ్చిన మృతదేహాన్ని ఒంగోలు ఫోరెన్సిక్ మెడికల్ బృందం, మార్టూరు మండల తహశీల్దారు సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పామని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details