ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లారీని ఢీకొన్న మరో వాహనం.. డ్రైవర్ సజీవ దహనం

By

Published : Feb 1, 2023, 7:12 PM IST

Eicher hit the lorry in nellore: నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Eicher hit the lorry  in nellore
నెల్లూరు జిల్లా

Eicher Hit the Lorry: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఐచర్ లారీ ఢీకొట్టింది. ఐచర్ లారీలో ఉండే వంటకు వినియోగించే చిన్న సిలిండర్ ఓపెన్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐచర్​ డ్రైవర్ సజీవ దహనమయ్యారు. క్లీనర్ స్వస్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఐచర్ వాహనం నర్సీపట్నం నుండి చెన్నైకు కాఫీ గింజలతో వెళ్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని దగదర్తి పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అగ్నిమాపక శాఖ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

లారీని ఢీకొన్న ఐచర్.. డ్రైవర్ సజీవ దహనం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details