ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైల్వే ఈఈ రూ.1.29 కోట్ల లంచం.. సీబీఐ కేసు.. 16 చోట్ల సోదాలు

By

Published : Nov 1, 2021, 7:54 PM IST

కాంట్రాక్టర్ల నుంచి రూ. 1.29 కోట్లు లంచం తీసుకున్నారనే అభియోగంపై.. దక్షిణ మధ్య రైల్వే ఈఈపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రైల్వే కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది.

cbi case on South Central Railway Bangalore EE bribe
రైల్వే ఈఈ రూ.1.29 కోట్ల లంచం.. సీబీఐ కేసు.. 16 చోట్ల సోదాలు

కాంట్రాక్టర్ల నుంచి రూ. 1.29 కోట్లు లంచం తీసుకున్నారనే అభియోగంపై దక్షిణ మధ్య రైల్వే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుపై సీబీఐ కేసు నమోదు చేసింది. గుత్తేదారుల నుంచి ఈఈ ఘన్‌శ్యాం ప్రధాన్‌ 2011 నుంచి 2019 వరకు రూ. 1.29 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ అభియోగం. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రైల్వే కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. లంచం సొమ్మును కాంట్రాక్టర్ల నుంచి తన ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారన్న అభియోగంపై ఈఈపై సీబీఐ బెంగళూరులో కేసు నమోదు చేసింది.

బెంగళూరులో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఘన్ శ్యాం ప్రధాన్‌, గుత్తేదారులు ఎం.సూర్యనారాయణ రెడ్డి, వంగల సూర్యనారాయణరెడ్డి, కృషి ఇన్ ఫ్రాటెక్ సంస్థను నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. సివిల్ పనులకు సంబంధించి ఆయాచిత వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు.. ఈఈ కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకొని.. ఆ సొమ్మును కుటుంబ సభ్యులతో పాటు నేరుగా తన ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారని సీబీఐ అభియోగం. నంద్యాల, రంగారెడ్డి జిల్లాతో పాటు బెంగళూరు, హుబ్లీ, మైసూరు, సంగ్లిలోని 16 ప్రాంతాల్లో ఇవాళ ఏకకాలంలో సీబీఐ బృందాలు సోదాలు జరిపాయి.

ABOUT THE AUTHOR

...view details