ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బరోడా మహిళా క్రికెట్ జట్టు వెళ్తున్న బస్సుకు ప్రమాదం

By

Published : Oct 21, 2022, 12:05 PM IST

Updated : Oct 21, 2022, 12:36 PM IST

Bus accident
బరోడా మహిళా క్రికెట్ జట్టుకు బస్సు ప్రమాదం

12:03 October 21

నలుగురికి గాయాలు, అపోలో ఆస్పత్రికి తరలింపు

విశాఖలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖలో జరుగుతున్న మహిళల సీనియర్ టి20 మ్యాచ్​లు ముగించుకొని ఎయిర్ పోర్టుకు వెళ్తున్న క్రమంలో తాటి చెట్లపాలెం జాతీయ రహదారి వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు... ముందు వెళ్తున్న లారీ బ్రేకులు వేయడంతో లారీని ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో గాయపడిన నలుగురికి చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 21, 2022, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details