ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వెంకాయమ్మపై మరోసారి దాడి.. ఈ సారి ఎందుకంటే..?

By

Published : Jun 12, 2022, 6:38 PM IST

ATTACK : గతంలో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంకాయమ్మపై.. మరోసారి అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. తనపై, తన కుమారుడిపై నల్లపు సునీత వర్గం కర్రలతో దాడిచేశారని వెంకాయమ్మ ఆరోపించారు.

ATTACK
వెంకాయమ్మపై మరోసారి దాడి

ATTACK: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో.. గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంకాయమ్మపై మరోసారి అధికార పార్టీ నాయకులు దాడి చేశారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... వైకాపాకు చెందిన నల్లపు సునీత వర్గీయులు.. పాత గొడవలను మనసులో పెట్టుకొని వెంకాయమ్మను నిత్యం దూషిస్తున్నారు. ఈ క్రమంలో.. వారి దుషణలను ఫోన్లో రికార్డు చేయాలని వెంకాయమ్మ తన కుమారుడికి సూచించింది. దీంతో.. ఆమె కుమారుడు ఫోన్లో రికార్డు చేస్తుండగా.. నల్లపు సునీత గమనించి వెంబడించింది. ఇది గమనించిన వెంకాయమ్మ కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి విషయం చెప్పాడు. ఈ క్రమంలో కంతేరు గ్రామ వాటర్ ట్యాంక్ వద్ద.. ఇరువర్గాలు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై నల్లపు సునీత వర్గీయులు కర్రలతో దాడిచేశారని బాధితులు తెలిపారు. ఈ గొడవపై ఇరు వర్గాలూ పోలీసులను ఆశ్రయించాయి.

వెంకాయమ్మపై మరోసారి దాడి

ABOUT THE AUTHOR

...view details