ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DRUGS: ఎఫిడ్రిన్ సరఫరా కేసు.. మరో ముగ్గురి అరెస్ట్

By

Published : May 18, 2022, 8:40 AM IST

DRUGS: విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ సరఫరా చేసిన కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి..న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్​కు తరలించామని తెలిపారు .

DRUGS
ఎఫిడ్రిన్ సరఫరా కేసు.. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్

DRUGS: విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ సరఫరా చేసిన కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ డీఎస్టీ కొరియర్లో పనిచేస్తున్న శ్యామ్ సుందర్, ప్రవీణ్ వర్మ, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి..న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్​కు తరలించామని తెలిపారు .

ఇక డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టుచేసిన అరుణాచలంను విచారించగా... కొరియర్ సిబ్బందికి డబ్బులు ఎరవేసి విదేశాలకు డ్రగ్స్ పంపేవారని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడ భారతినగర్ కార్యాలయంలో తేజతో పాటు... హైదరాబాద్‌లో కొందరితో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాడన్నారు. కొరియర్ పార్సిల్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వస్తువులను తనిఖీ చేయాలని, నిషేధిత వస్తువులు లేవని నిర్ధారించుకున్నాకే స్వీకరించాలని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: 'ఆనందాన్ని ఎవరు కోరుకోరు'.. ఈ సిగరెట్​​ యాడ్​ పాప అందాన్ని ఇప్పుడు చూస్తే..

ABOUT THE AUTHOR

...view details