ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడుపులో దూది మరచిపోయిన వైద్యులు.. కడుపునొప్పితో మహిళ మృతి

By

Published : Sep 21, 2021, 2:06 PM IST

lady died at Telangana

ప్రసవం చేసే సమయంలో ఓ మహిళ కడుపులో వైద్యులు దూది మరచిపోవడంతో మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఏడాది క్రితం రాయగిరికి చెందిన మహిళకు యాదాద్రి భువనగిరిలోని కె.కె. ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆ తర్వాత నుంచి మహిళ కడపునొప్పితో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో మహిళ కడుపులో వైద్యులు దూదిని గుర్తించారు.

ప్రసవానికి ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. ఏడాది తొలి కాన్పులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కడుపునొప్పి మొదలైంది. మొదట్లో.. ప్రసవం వల్ల వస్తోన్న నొప్పేమో అనుకుంది. ఎన్నిరోజులైనా తగ్గకపోవడం వల్ల పలు ఆస్పత్రులకు వెళ్లింది. ఎక్కడా వైద్యులు నొప్పికి గల కారణాలు చెప్పలేకపోయారు. చివరకు నొప్పి తీవ్రం కావడం వల్ల హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వివిధ పరీక్షలు చేయగా తొలి కాన్పు సమయంలో కడుపులో దూది మరిచిపోవడం వల్ల పేగులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇది మొదట్లోనే గుర్తించకపోవడం వల్ల ఆ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఏడాది క్రితం రాయగిరికి చెందిన మహిళకు యాదాద్రి భువనగిరిలోని కె.కె. ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆ తర్వాత నుంచి మహిళ కడపునొప్పితో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో మహిళ కడుపులో వైద్యులు దూదిని గుర్తించారు.

తొలి కాన్పు సమయంలో కడుపులో వైద్యులు దూది మరిచిపోయినట్లు తేలింది. కాగా, చికిత్స పొందుతూ ఆరు నెలల గర్భిణి ఇవాళ మృతి చెందింది. మహిళ కడుపులో దూది కారణంగా పేగులు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మహిళ మృతికి తొలి కాన్పు చేసిన వైద్యులే కారణమని ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు కాన్పు చేసిన ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట మహిళ మృతదేహంలో నిరసన వ్యక్తం చేశారు. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details