ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆటో, లారీ ఢీ.. 10 మందికి గాయాలు

By

Published : Mar 2, 2021, 11:38 AM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి.

road accident at nalgonda
ఆటో, లారీ ఢీ.. 10 మందికి గాయాలు

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన కూలీలు మిర్చి ఏరివేతకు వెళ్లి ఆటోలో తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. దామరచర్ల వద్ద వారి ఆటోను లారీ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 10 మంది కూలీలకు గాయాలయ్యాయి.

వారిని స్థానికులు 108లో మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details