ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cyber Crime: ఎమ్మెల్యేలను మోసగించి వసూళ్లు.. ఆ డబ్బుతో ప్రేయసికి ఖరైదీన ఇల్లు

ఎమ్మెల్యేలను మోసగించి వసూళ్లు
ఎమ్మెల్యేలను మోసగించి వసూళ్లు

By

Published : May 1, 2022, 6:13 PM IST

Updated : May 1, 2022, 7:54 PM IST

18:08 May 01

ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ.2.5 కోట్లు వసూలు: పోలీసులు

సీఎంవో నుంచి ఫోన్​ చేస్తున్నానంటూ ఎమ్మెల్యేలను మోసం చేస్తున్న ఓ సైబర్ మోసగాడిని రాజస్థాన్ పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్​కు చెందిన విష్ణుమూర్తి అలియాస్ సాగర్.. సీఎంవో నుంచి ఫోన్ చేస్తున్నానంటూ రాజస్థాన్​కు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు ఎమ్మెల్యే తనకు వచ్చిన ఫోన్ కాల్​పై రాజస్థాన్ భివాండి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు విశాఖలోని గాజువాక నుంచి మాట్లాడినట్లు గుర్తించారు. అనంతరం విశాఖ చేరుకొని సైబర్​ నేరగాడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఆ డబ్బుతో తన ప్రేయసికి గాజువాకలో రూ.80 లక్షల విలువైన విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: Gang Rape: టైమ్ అడిగి భర్తతో వివాదం.. ఆపై భార్యపై అత్యాచారం: బాపట్ల ఎస్పీ

Last Updated : May 1, 2022, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details