ఆంధ్రప్రదేశ్

andhra pradesh

House Arrest: సీఎం విశాఖ పర్యటన.. ప్రతిపక్ష నేతల గృహనిర్బంధం

By

Published : Apr 28, 2022, 10:25 AM IST

House Arrest: నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతలను గృహ నిర్బంధించారు.

TDP leaders house arrest
సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతల గృహనిర్బంధం

House Arrest: విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధించారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని ఆయన ఇంటివద్ద నిర్బంధించారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.

CM Jagan Tour: నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 9.20కి తాడేపల్లి నుంచి బయలుదేరి... 10.40కి అనకాపల్లి జిల్లా... సబ్బవరం చేరుకోనున్నారు. ఉదయం 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం సహా లే అవుట్లను పరిశీలించనున్నారు. అనంతరం మోడల్‌ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్‌ ప్రారంభోత్సవం, ల్యాండ్‌ పూలింగ్‌ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్. తదితర కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఇళ్ల పట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదీ చదవండి: పత్రికా స్వేచ్ఛతోనే సమాజం, ప్రజాస్వామ్య పరిరక్షణ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details