ETV Bharat / state

పత్రికా స్వేచ్ఛతోనే సమాజం, ప్రజాస్వామ్య పరిరక్షణ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

author img

By

Published : Apr 28, 2022, 9:56 AM IST

VENKAIAH NAIDU: నెల్లూరులో ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. 100 మీటర్ల టవర్‌, 10 కిలోవాట్ల సామర్థ్యమున్న ఎఫ్‌ఎం స్టేషన్‌ను ప్రారంభించారు. సత్యదూరమైన వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం నిజమైందా.. కాదా? అనేది తెలుసుకోకుండా ఇతరులకు చేరవేయకూడదని అన్నారు. పత్రికా స్వేచ్ఛతోనే సమాజం, ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

FM STATION LAUNCH BY VICE PRESIDENT VENKAIAH NAIDU
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తోన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

VENKAIAH NAIDU: ‘ప్రస్తుత సాంకేతిక యుగంలో మాట పెదవి దాటేలోపు.. సమాచారం పృథీని దాటుతోంది. అందుకే, ఇచ్చే సమాచారం కచ్చితమైందేనా అని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. పత్రికా స్వేచ్ఛతోనే సమాజం, ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారి విషయంలో ప్రజలు కఠినంగా వ్యవహరించాలి’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులో ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. 100 మీటర్ల టవర్‌, 10 కిలోవాట్ల సామర్థ్యమున్న ఎఫ్‌ఎం స్టేషన్‌ను ప్రారంభించారు. సత్యదూరమైన వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం నిజమైందా.. కాదా? అనేది తెలుసుకోకుండా ఇతరులకు చేరవేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రసారభారతి సీఈవో శశిశేఖర్‌ వెంపటి, ఆకాశవాణి డీజీ వేణుధర్‌రెడ్డి, ఏడీజీ వి.రామాకాంత్‌, చెన్నై డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆనందన్‌, ఇంజినీరింగ్‌ విభాగ డైరెక్టర్‌ సోమేశ్వరరావు, కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎన్‌ఎంసీ కమిషనర్‌ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.

ఛారిటబుల్‌ ట్రస్టుకు ప్రారంభోత్సవం..: ‘ప్రతి ఊళ్లో ఒక విద్యాలయం, గ్రంథాలయం, వైద్యాలయం, దేవాలయంతో పాటు ఒక సేవాలయం కచ్చితంగా ఉండాలి. ఉన్నతస్థానంలో ఉన్నవారు తమ గ్రామాల్లో దాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలి’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులో దేవిరెడ్డి శారద ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను ఆయన ప్రారంభించారు. భార్య పేరిట ఇలాంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, దేవిరెడ్డి శారద ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ట్రస్టీలు దశరథ రామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రఘురామరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Minister Roja: పర్యాటక రంగానికి నేనే అంబాసిడర్‌: మంత్రి రోజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.