ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో 49 కిలోలు గంజాయి స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్

By

Published : Dec 22, 2020, 3:15 PM IST

విశాఖలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు యాంటీ డ్రగ్​ డ్రైవ్​ చేపట్టారు. పులగానిపాలెం, అగనంపూడిలో జరిపిన తనిఖీల్లో 49కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ శ్రీపాదరావు తెలిపారు.

ganja caught
గంజాయి పట్టివేత

యాంటీ డ్రగ్ డ్రైవ్​లో భాగంగా.. విశాఖలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న 49కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి, అగనంపూడిలో పట్టుకున్న మొత్తం సరుకు విలువ.. సుమారు రూ. 98 వేలు ఉంటుందని వెస్ట్ జోన్ ఏసీపీ శ్రీపాదరావు తెలిపారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

జిల్లాలోని ముంచింగిపుట్టు నుంచి తీసుకువచ్చి పెందుర్తిలోని పులగానిపాలెంలో విక్రయిస్తున్న 15 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద 34 కిలోల గంజాయిని.. పెదబయలు నుంచి హైదరాబాద్​కు తరలిస్తుండగా అడ్డుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details