ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతు భరోసా ఆసరాగా మోసాలు... ఖాతాల్లో మొత్తం స్వాహా

By

Published : May 22, 2022, 6:33 PM IST

Biometric Cheating: రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దగా చేశాడో మోసగాడు. రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ అయ్యాయో లేదో చూసి చెప్తానని.. ఉన్న పైసలను ఊడ్చేశాడు. బయోమెట్రిక్​ మెషిన్లలో వేలిముద్రలు తీసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

Biometric Cheating
Biometric Cheating

Biometric Cheating: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గసరాపల్లిలో రైతు భరోసా పథకాన్ని ఆసరా చేసుకుని మోసాలు జరిగాయి. ఇటీవల ప్రభుత్వం రూ.5 వేల 500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని తులసి రాజ్ అనే వ్యక్తి డబ్బు పడిందా లేదా చూసి చెబుతానంటూ మోసం చేశాడని.. రైతులు వాపోతున్నారు. యాప్ ద్వారా పని చేసే బయోమెట్రిక్ మిషన్​తో వేలిముద్రలు సేకరించి 8 మంది నుంచి డబ్బులు కాజేశాడని మండల ఉపాధ్యక్షుడు కొండలరావు వెల్లడించారు. ఎవరి ఫోన్లలో వారు పరిశీలించేందుకు సిగ్నల్ లేకపోవడం.. ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లేందుకు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి రావడాన్ని అక్రమార్కులు ఆసరా చేసుకుని మోసానికి పాల్పడినట్లు తెలిపారు.

రైతు భరోసా ఆసరాగా మోసాలు...ఖాతాల్లో మొత్తం స్వాహా...

TAGGED:

ABOUT THE AUTHOR

...view details