ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు.. విజయవాడలో తెదేపా నేతపై దాడి

By

Published : Sep 3, 2022, 8:54 PM IST

YSRCP ATTACK ON TDP ACTIVIST: రాష్ట్రంలో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారుల అండ ఉందనే ధైర్యంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన వారిని బెదిరించడమో లేక దాడి చేయడమో చేస్తున్నారు. అమాయకులైన వారి భూములను లాక్కోవడం.. స్థలాలు కబ్జా చేయడం లాంటి ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కార్పొరేషన్​ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థి మద్యం మత్తులో తెదేపా నాయకుడిపై దాడి చేశాడు.

YSRCP ATTACK ON TDP ACTIVIST
YSRCP ATTACK ON TDP ACTIVIST

ATTACK ON TDP LEADER :విజయవాడలో తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. పటమటలంకలోని గర్ల్స్‌ హైస్కూల్ వద్ద గాంధీని వైకాపా వర్గీయులు చితక బాదారు. కంటికి తీవ్ర గాయాలు కాగా ఆయన్ను తాడిగడప ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. వైకాపా వర్గీయులు, దేవినేని అవినాష్ మనుషులే దాడి చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తొమ్మిదో డివిజన్ నుంచి చెన్నుపాటి గాంధీ భార్య కార్పొరేటర్​గా పోటీ చేసి గెలుపొందారు. వైకాపా నుంచి ఓడిపోయిన అభ్యర్థి మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని.. వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, వైకాపా నాయకులు గద్దె కళ్యాణ్, సుబ్బు, మరో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని తెదేపా నాయకులు ఆరోపించారు.

గాంధీపై దాడిని ఖండించిన చంద్రబాబు, లోకేశ్​ :వైకాపా శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. గాంధీ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. చెన్నుపాటి గాంధీపై దాడి చేసింది వైకాపా ఫ్యాక్షన్ మూకలేనన్న తెదేపా నేత నారా లోకేశ్‌.. దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుందో అధికారంలోకి వచ్చాక చూపిస్తామన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details