ETV Bharat / crime

లారీతో ఢీకొట్టి చంపబోయాడు.. కారణం అదేనా..!

author img

By

Published : Sep 3, 2022, 7:49 PM IST

Murder Attempt: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. జీవితాంతం కలిసుంటామని ఒక్కటైన వాళ్లను సైతం విడదీస్తున్నాయి. అంతేకాదు.. ఒక్కోసారి ప్రాణాలను సైతం తీస్తోంది. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రియుడి మోజులో పడి అతనితోనే భర్తను అంతమొందించేందుకు యత్నించింది ఓ భార్య. అదృష్టవశాత్తు అతను బయటపడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసిన ఘటన ఎన్టీఆర్​ జిల్లాలో జరిగింది.

ibrahimpatnam ps
ibrahimpatnam ps

Murder Attempt: ఈనెల ఒకటో తేదీ శ్రీనివాసరావు తుమ్మలపాలెం నుండి ద్విచక్రవాహనంపై ఇబ్రహీంపట్నంలోని ఇంటికి వెళ్తున్నాడు. వెనక నుంచి వస్తున్న లారీ అతడిని ఢీకొట్టబోయింది. ఇది గమనించిన శ్రీనివాసరావు తప్పించుకున్నాడు. ఈ షాక్​ నుంచి తేరుకున్న తర్వాత అతను మళ్లీ ఇంటికి బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత తనను ఢీకొట్టేందుకు యత్నించిన లారీ.. రోడ్డు పక్కన కనిపించింది. వెంటనే లారీ దగ్గరకు వెళ్లి పరిశీలించగా డ్రైవర్​ సీట్లో ఓ వ్యక్తి కనిపించాడు. అతన్ని చూసి శ్రీనివాసరావు షాక్​ అయ్యాడు. అతను ఎవరంటే..

Illegal Affair: పోలా శ్రీనివాసరావు ఎన్టీఆర్​ జిల్లా ఇబ్రహీంపట్నంలో క్యాటరింగ్​ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. కొన్నాళ్లకు ఇవి తీవ్రరూపం దాల్చడంతో అతని భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అతను పోలీస్​స్టేషన్​లో​ ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. రోజులు గడుస్తున్నాయి.. ఆమె ఆచూకీ లభించలేదు. కానీ ఒకరోజు ఆమె ప్రియుడు శంకర్​ దగ్గర ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు వెళ్లి ఆమెను తీసుకువచ్చి.. పంచాయతీ చేశారు. పెద్దలంతా భార్యాభర్తలకు నచ్చజెప్పి.. కాపురం చక్కగా చేసే విధంగా సర్దిచెప్పారు. అప్పటినుంచి భార్యాభర్తలిద్దరూ మంచిగానే ఉన్నారు. కానీ తాజాగా శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది.

తనను లారీతో ఢీకొట్టేందుకు యత్నించిన వ్యక్తి,.. తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు ఎవరి దగ్గర ఉందో ఆ వ్యక్తి ఆమె ప్రియుడు శంకర్​గా శ్రీనివాసరావు గుర్తించాడు. అంతే అతని కోపం ఆగలేదు.. శంకర్​తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో శంకర్​ రాడ్డుతో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. స్థానికులు వారిద్దరి విడదీసి శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించారు. అనంతరం శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీనివాసరావు భార్య, ప్రియుడు శంకర్​ను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.