ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజాధనంతో రాష్ట్రంలో మత వ్యాప్తి: ప్రధానికి రఘురామ లేఖ

By

Published : Oct 28, 2020, 2:36 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బును మత వ్యాప్తికి ఉపయోగిస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. మత మార్పిడి అంశం అధికారికంగా ప్రభుత్వ రికార్డుల్లోకి రావడంలేదన్నారు. చర్చి పాస్టర్లకు రూ. 5 వేలు ఇస్తోందని.. ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని ప్రధానిని కోరారు.

raghurama krishna raju
రఘురామ కృష్ణరాజు

ఏపీలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చి పాస్టర్లకు నెలకు రూ.5 వేలు ఇస్తోందని.. ప్రజల డబ్బును మతవ్యాప్తికి ఉపయోగించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో హిందూ ఆలయాలకు సమానంగా చర్చిలు ఏర్పాటయ్యాయని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ ప్రస్తావించారు. మతమార్పిడి అంశం అధికారికంగా ప్రభుత్వ రికార్డుల్లోకి రావట్లేదన్నారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి చట్ట సభలకు వస్తున్నారని... మరికొంత మంది విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు వాడుకుంటున్నారని వివరించారు. ఏపీలో సుమారు 33 వేల చర్చిలు ఏర్పాటైనట్లు సమాచారం ఉందన్నారు. 2021 జనాభా లెక్కల్లో అర్హులైన వారికే రిజర్వేషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

రైతులకు క్షమాపణ చెబుతున్నా

అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారని... తమ పార్టీ తరఫున అన్నదాతలకు క్షమాపణ చెబుతున్నానని రఘురామకృష్ణరాజు అన్నారు. ఈసీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మరోసారి భంగపాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపే పరిస్థితి తీసుకురావద్దని కోరారు.

ఇవీ చదవండి..

రైతులకు బేడీలా? దీని కోసమేనా ఒక్కఛాన్స్​ అడిగింది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details