ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై పర్యవేక్షణకు ఫోరం'

By

Published : Oct 16, 2020, 7:24 PM IST

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై పర్యవేక్షణకు దళిత, గిరిజన వాచ్ ఫోరం ప్రారంభిస్తున్నామని దళిత బహుజన వనరుల కేంద్రం అధ్యక్షుడు అల్లాడి దేవకుమార్ వెల్లడించారు. ఇందులోని సభ్యులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, బడ్జెట్​లో కేటాయింపులుపై అవగాహన కల్పించేందుకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు.

dalit resource center
dalit resource center

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం పని చేసేవారితో దళిత, గిరిజన బడ్జెట్ వాచ్ ఫోరం ప్రారంభిస్తున్నామని దళిత బహుజన వనరుల కేంద్రం అధ్యక్షుడు అల్లాడి దేవకుమార్ విజయవాడలో శుక్రవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమల్లోకి వచ్చాక ప్రభుత్వాలు బడ్జెట్​లో వెనుకబడిన వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేస్తూ ఖర్చు పెడుతున్నాయన్నారు.

దళిత గిరిజన బడ్జెట్ ఫోరంలోని సభ్యులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, బడ్జెట్​లో కేటాయింపులుపై అవగాహన కల్పించేందుకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించేలా ఈ ఫోరమ్ సభ్యులు పర్యవేక్షిస్తారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details