ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెత్తపన్ను సేకరించని ఇద్దరు సచివాలయ ఉద్యోగుల తొలగింపు

By

Published : Aug 21, 2022, 11:37 AM IST

Secretariat Employees Suspension చెత్త పన్ను సేకరించలేదంటూ విజయవాడలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులను తొలగించారు. లక్ష్యం మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలమయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Ward Secretariat Employees Suspension
సచివాలయం ఉద్యోగుల తొలగింపు


Ward Secretariat Employees Suspension చెత్తపన్ను వసూలు చేయలేదంటూ విజయవాడ నగరంలో వార్డు సచివాలయ ఉద్యోగులపై వేటు వేశారు. ఇద్దరు శానిటేషన్ సెక్రటరీ లను సస్పెండ్ చేస్తూ విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్తిల్ దినకర్ ఉత్తర్వులు జారీచేశారు. 48వ వార్డు సచివాలయంలో శానిటరీ అండ్ ఎన్విరాన్ మెంట్ సెక్రటరీ కె. చెన్నకృష్ణ తో పాటుగా, 57 వ వార్డు సచివాలయంలో షేక్ సలీమ్ బాషను సస్పెండ్ చేశారు. విజయవాడ లో 13 వ డివిజన్ లో లక్ష్యం మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలమయ్యారని ఉత్తర్వల్లో పేర్కొన్నారు. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తాయని, మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details