ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాసరలో వసంత పంచమి వేడుకలు

By

Published : Feb 16, 2021, 9:07 AM IST

తెలంగాణ బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేపట్టారు.

vasantha panchami celebrations at basara
బాసరలో వసంత పంచమి వేడుకలు

తెలంగాణ నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ తిథిని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి అమ్మవారికి విశేష అలంకరణ, హారతి, నివేదన సేవ నిర్వహించారు.

సరస్వతి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేపట్టారు. అక్షరాభ్యాసాలపై కరోనా ప్రభావం పడింది. దీనితో భక్తుల సంఖ్య తగ్గింది. బాసర వద్ద గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఆలయంలో మాస్కుల ధారణ, భక్తుల మధ్య సామాజిక దూరం కనిపించడం లేదు. సాయంత్రం అమ్మవారికి చతుషష్టిపూజలు, హారతి నివేదన నిర్వహించనున్నారు. అమ్మవారికి పల్లకి సేవ నిర్వహణతో ఉత్సవం ముగియనుంది.

ఇదీ చూడండి:ఆంగ్లమాధ్యమంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details