ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'దేశంలోనే విజయ బ్రాండ్‌ను అత్యున్నతగా తీర్చిదిద్దనున్నాం'

By

Published : Dec 20, 2020, 4:15 AM IST

హైదరాబాద్​లోని శంషాబాద్‌లో మెగా డెయిరీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్‌ వెల్లడించారు. రూ.250 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. 40 ఎకరాల్లో ఈ మెగా డెయిరీ ఉంటుందని వివరించారు. పోటీ ప్రపంచంలో తెలంగాణ విజయ డెయిరీని అగ్ర స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

TS Minister Talasani Open Vijaya Store In vijayawada
TS Minister Talasani Open Vijaya Store In vijayawada

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశంలోనే విజయ బ్రాండ్‌ను అత్యున్నతగా తీర్చిదిద్దనున్నామని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సహకార రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతులకు మేలు జాతి గేదెలను అందించనున్నట్టు వెల్లడించారు. 2014లో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని ప్రస్తుతం లాభాల్లోకి తీసుకువచ్చామని సంతోషం వ్యక్తం చేశారు.

విజయ డెయిరీకి ఇప్పటికే నాణ్యతలో నమ్మకం ఉందని, దేశవ్యాప్తంగా నెయ్యికి డిమాండ్‌ ఉందని తలసాని గుర్తుచేశారు. ఏపీలోనూ విజయ బ్రాండ్‌ను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడలో.. తెలంగాణ విజయ డెయిరీ నుంచి వచ్చే పాలు, ఇతర పాల పదార్థాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయడెయిరీ ఎండీ శ్రీనివాసరావు, తెలంగాణ పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలంగాణ పాడిపరిశ్రామాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ లోకా భూమారెడ్డి తదితరలు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details