ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'యువత ఉపాధి కోసం ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడకూడదు'

By

Published : Mar 3, 2022, 5:27 PM IST

Vice President Venkaiah Naidu : యువత ఉపాధి కోసం ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడ కూడదని.. వివిధ రంగాల్లో అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో పోటీ అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో.. నైపుణ్యం, క్రమశిక్షణతోనే విజయాలు సాధ్యమవుతాయని యువతకు దిశానిర్దేశం చేశారు.

Vice President Venkaiah Naidu
Vice President Venkaiah Naidu

Vice President Venkaiah Naidu : సమాజంలోని అన్ని రంగాల్లో పోటీ అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో.. నైపుణ్యం, క్రమశిక్షణతోనే విజయాలు సాధ్యమవుతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. యువతకు దిశానిర్దేశం చేశారు. తమ రంగాల్లో నైపుణ్యాన్ని సముపార్జించుకుని, క్రమశిక్షణతో, ఇష్టపడి కష్టపడడం ద్వారా విజయాలు సాధ్యమౌతాయని సూచించారు. విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్​లో వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. యువత ఉపాధి కోసం ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడ కూడదని.. వివిధ రంగాల్లో అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి పొందడం వల్ల బంగారు భవిష్యత్తుతో పాటు స్వయం ఉపాధి పొందే విధంగా.. ప్రైవేట్ రంగం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా యువత అభివృద్ధికి ప్రధాన మంత్రి మోదీ.. పెద్ద పీట వేస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. దీని కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.

ముగిసిన పర్యటన

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రాష్ట్ర పర్యటన ముగిసింది. నాలుగు రోజులుగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు బయలుదేరి వెళ్లారు. ఉపరాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అధికారులు వీడ్కోలు పలికారు.

ఇదీ చదవండి :రాజకీయ నాయకులకు నైతిక విలువలుండాలి : వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details