ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు...పోలీసులకు పీసీబీ ఫిర్యాదు

By

Published : Aug 30, 2020, 11:06 AM IST

కాలుష్య నియంత్రణ మండలి అధికారినంటూ పారిశ్రామిక వేత్తలను ఫోన్ చేసి...డబ్బు డిమాండ్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని పీసీబీ గుర్తించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

pollution-control-board
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి

కాలుష్య నియంత్రణ మండలి అధికారినంటూ శ్రీకాకుళం, గుంటూరు జిల్లా పారిశ్రామికవేత్తలకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్న వ్యక్తిని... కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఈ విషయంపై ఆయా జిల్లాలోని పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయన్న పీసీబీ అధికారులు..... శంకర్‌రెడ్డి అనే వ్యక్తి నంబర్‌ నుంచి ఈ ఫోన్లు వస్తున్నట్లు తెలిపింది. తాను పీసీబీ సహాయ పర్యావరణ ఇంజినీర్‌ శంకర్‌రెడ్డినంటూ ..... పారిశ్రామికవేత్తలతో పరిచయం చేసుకుంటున్నట్లు తేలిందని ప్రకటనలో తెలిపింది.

హైకోర్టులో ఉన్న కేసుల రికార్డ్‌లను ప్రధాన కార్యాలయంలో తారుమారు చేసి వీగిపోయేలా చేస్తానని హామీ ఇచ్చి.... పెద్దమొత్తంలో డబ్బు పంపాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తేల్చారు. తమ విచారణలో ఈ వ్యవహారం బయటపడిందని పీసీబీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి అడ్రెస్‌తో ఆ నంబర్‌ ఉండడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:గుండె పోటుతో 'హాత్ వే' రాజశేఖర్ మృతి

ABOUT THE AUTHOR

...view details