ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తెలుగు సినీ పరిశ్రమకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ల లాంటివి'

By

Published : Sep 26, 2021, 10:32 PM IST

సాయిధరమ్​తేజ్​ నటించిన రిపబ్లిక్​ సినిమా ప్రీరిలీజ్​ వేడుక(republic movie pre release event)లో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు(pawan kalyan speech latest) ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మా ఎన్నికల(maa elections 2021) అంశం రసవత్తరంగా సాగుతున్న సమయంలో.. పవన్​ కామెంట్లు పెద్ద చర్చకే తెరతీశాయి. పవన్​ వ్యాఖ్యలపై అటు ఏపీ ప్రభుత్వ పెద్దలు కౌంటర్లిస్తుండగా.. ఇటు సినీ పెద్దల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా.. ఈ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్(telugu film chamber)​ ఎలా స్పందించిందో మీరూ చూడండి.

telugu-film-chamber
telugu-film-chamber

కరోనా ప్రభావంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ(telugu film industry)పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం, ఆవేదన ఉందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(telugu film chamber) వెల్లడించింది. వివిధ సందర్భాలు, వేదికలపై వారు వ్యక్తం చేసే అభిప్రాయాలు మొత్తం సినీ పరిశ్రమ అభిప్రాయం కాదని.. అవి వారి వ్యక్తిగతమని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాలు రెండు కళ్లు..

సాయిధరమ్​తేజ్​ నటించిన రిపబ్లిక్ సినిమా.. ముందస్తు విడుదల వేడుక(republic movie pre release event)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల(pawan kalyan speech latest) నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్​ ఓ ప్రకటనను విడుదల చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలను ఛాంబర్ పరోక్షంగా​ ఖండించింది. తెలుగు సినీ పరిశ్రమకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ల లాంటివని అభిప్రాయపడిన ఛాంబర్.. ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. 2020 మార్చి నుంచి పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయని నారాయణదాస్ నారంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మద్దతు ఇలాగే కొనసాగాలి...

కరోనా పరిస్థితులు, ఇతర సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు వెల్లడించారు. మంత్రి పేర్ని నాని సమక్షంలో జరిగిన చర్చల్లో సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమను కాపాడేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారన్నారు. ఆ ప్రోత్సాహం అలాగే కొనసాగాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది.

పవన్​ వ్యాఖ్యలేంటంటే..

సినీపరిశ్రమపై చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారని రిపబ్లిక్​ ప్రీరిలీజ్​ వేడుకలో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ తీవ్రస్థాయిలో స్పందించారు. సుధీర్ఘంగా సాగిన పవన్​ ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మీదున్న కోపంతో ఏపీ ప్రభుత్వం.. మొత్తం సినీపరిశ్రమ పొట్ట కొడుతోందని ఆరోపించారు. సినిమాలు విడుదల కాకుండా ఆపేస్తోందన్నారు. "చిత్ర పరిశ్రమవైపు కన్నెత్తి చూడకండి. కాలిపోతారు జాగ్రత్త" అంటూ ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యలో మోహన్​బాబు ప్రస్తావన కూడా తెచ్చారు.​ వైకాపా ప్రభుత్వానికి మద్దతు తెలిపే.. మోహన్​బాబు సినిమాలు ఆపేయటంపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. దీనిపై స్పందించిన మోహన్​బాబు.. సెటైరికల్​గా సమాధానం ఇచ్చారు. మా ఎన్నికలు అయ్యాక అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. మరోవైపు.. హీరో నాని కూడా పవన్​ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మాటల్లో నిజాయతీ ఉందని.. ఆ వైపుగా ఏపీ ప్రభుత్వం ఆలోచించాలంటూ... తన మద్దతు ప్రకటించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details