ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MP KANAKAMEDALA : "విభజన హామీలపై.. పోరాడితే మద్దతిచ్చేందుకు సిద్ధం"

By

Published : Jan 3, 2022, 10:18 PM IST

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఇచ్చిన వినతులనే ఇస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఏమీ అడగడం లేదని విమర్శించారు. విభజన హామీల కోసం పోరాడితే మద్దతిచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని కనకమేడల స్పష్టం చేశారు.

తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

గతంలో ఇచ్చిన వినతులనే మళ్లీ మళ్లీ ఇస్తున్నారే తప్ప.. దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ సాధించిందేమిటో చెప్పాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. సీఎం జగన్‌.. ప్రధానిని, ఆర్థికమంత్రిని కలవడం సంతోషంగా ఉందన్న కనకమేడల.. భేటీలో ఏం జరిగిందో బయటికి చెప్పాలని కోరారు. గతంలో పోలవరంపై సీఎం జగన్ రాసిన లేఖ వల్లే ఈరోజు రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజీనామా చేసేందుకు సిద్ధమా..?
భేటీలో ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్, రైల్వేజోన్‌పై ఎందుకు చర్చించలేదని కనకమేడల ప్రశ్నించారు. ఈ పరిస్థితిని చూస్తుంటే ఆ ప్రాజెక్టులకు తిలోదకాలు ఇచ్చినట్లు అర్థమవుతోందని అన్నారు. సీఎం జగన్‌ గతంలో 2సార్లు ప్రధానిని కలిశారని, అప్పుడు అవే డిమాండ్లు, ఇప్పుడు కూడా అవే డిమాండ్లు కోరారని వివరించారు.

కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయని, కేంద్రం ఎన్నివేల కోట్లు ఇచ్చిందో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసేందుకు తెదేపా ఎంపీలు సిద్ధమని.. వైకాపా ఎంపీలు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ప్రధాని, ఆర్థికమంత్రిని ముఖ్యమంత్రి జగన్ కలవడం సంతోషంగా ఉంది. ప్రధాని, ఆర్థికమంత్రితో ఏం మాట్లాడారో బయటకు చెప్పాలి. గతంలో పోలవరంపై జగన్ రాసిన లేఖ వల్లే ఇవాళ రాష్ట్రానికి నష్టం వాటిల్లింది. సీఎం జగన్‌ గతంలో రెండుసార్లు ప్రధానిని కలిశారు. అప్పుడూ అవే డిమాండ్లు.. ఇప్పుడూ అవే డిమాండ్లు. కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో బుగ్గన చెప్పాలి. - కనకమేడల రవీంద్రకుమార్, తెలుగుదేశం ఎంపీ

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details