ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leaders Fire On YCP: 'మేం తలుచుకుంటే.. వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరు'

By

Published : Nov 20, 2021, 7:54 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు (TDP Leaders Fire On YCP) మండిపడ్డారు. చంద్రబాబు పోరాట పటిమ చూసి ఓర్వలేకనే అప్రతిష్టపాలు చేయాలని వైకాపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న నేతలు..తాము తలుచుకుంటే వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.

TDP Leaders Fire On YCP
తెదేపా నేతలు

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణిపై శాసనసభలో వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో (TDP Leaders Fire On YCP) మండిపడ్డారు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. వైకాపా అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. చేతగాక, చేవలేక సీఎం జగన్ నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు.

వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరు..
ముఖ్యమంత్రి జగన్, వైకాపా నేతలపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కుటంబంపై వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండించిన ఆమె..తాము తలుచుకుంటే వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. " వైకాపా గౌరవ సభను, కౌరవ సభగా మార్చేసింది. ఆనాడు సీతను అవమానించిన రావణాసరుడికి ఏ గతి పట్టిందో నేడు భువనేశ్వరిని అవమానించిన వైకాపాకి అదే గతి పడుతుంది. వైకాపా నాయకులందరికీ డీఎన్ఏ పరీక్షలు చేయించాలి. వైకాపా ఎమ్మెల్యేలు తమ ఇంటి మహిళలతో డీఎన్ఏ పరీక్షలకు వెళ్దాం అని చెప్పగలరా..? తాము తలుచుకుంటే వైకాపా నేతలు రోడ్డుపైకి రాలేరు." అని పీతల సుజాత హెచ్చరించారు.

చేతగాక నీచపు పనులు
వివేకా రక్తపు మరకలు ఆనాడు ఎలా తుడిచేశారో.. ఈనాడు వైకాపా ఎమ్మెల్యేల మాటలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించారని తెదేపా శాసనసభపక్ష విప్ డోలా బాల వీరంజనేయ స్వామి మండిపడ్డారు. సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే నిన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి మాట్లాడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేసిన చరిత్ర జగన్​దని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. చేతగాక, చేవలేక జగన్ నీచపు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నేతలు పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారని ధ్వజమెత్తారు. పాలన వైఫల్యాలను కప్పిపుచుకోవడానికి చంద్రబాబు కుటుంబ సభ్యులపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠతను దెబ్బతీయాలనే కుట్ర చేసారన్నారు. చంద్రబాబు పోరాట పటిమ చూసి ఓర్వలేకనే అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆక్షేపించారు.

వైకాపా పతనం ప్రారంభం
వైకాపా ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత చూసిన వైకాపా నాయకులు.. ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారన్నారు. దేవాలయం లాంటి శాసనసభలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గురించి చెడుగా మాట్లాడటం వారి విజ్ఞతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ..ప్రజలకు రక్షణ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నా..చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే.. వైకాపా నాయకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

ఇదీ చదవండి

TDP Protest: రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు.. అరెస్టులు..

ABOUT THE AUTHOR

...view details