ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leaders: రాజకీయాలు ఒకేలా ఉండవు..వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుతాం: తెదేపా

By

Published : Nov 19, 2021, 7:34 PM IST

Updated : Nov 19, 2021, 8:51 PM IST

శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా నేతలు మండిపడ్డారు. మంత్రి పదవుల కోసం మహిళల్ని కించపరిచే స్థాయికి వైకాపా నేతలు దిగజారారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. కచ్చితంగా వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

రాజకీయాలు ఒకేలా ఉండవు..వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుతాం
రాజకీయాలు ఒకేలా ఉండవు..వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుతాం

మంత్రి పదవుల కోసం మహిళల్ని కించపరిచే స్థాయికి వైకాపా నేతలు దిగజారారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. వైకాపా నాయకుల నీచమైన భాష విని... కుటుంబ సభ్యులే తిరగబడి కొట్టే రోజులు వచ్చాయని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేల వైఖరి ఏ మాత్రం సమర్థనీయంగా లేదని నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. కచ్చితంగా వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు.

రాజకీయాలు ఒకేలా ఉండవు..వైకాపా నేతలకు తగిన బుద్ధి చెబుతాం

ప్రజలు అసహ్యించుకునేలా వారి భాష

ప్రజలు అసహ్యించుకునేలా వైకాపా ఎమ్మెల్యేల భాష ఉందని తెదేపా నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ గ్రహించాలని హితవు పలికారు.

వైకాపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..

శాసనసభను బహిష్కరించాలని అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయన్నే పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాటిస్తారని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిన తర్వాత, నాటి పార్టీ అధినేత ఎన్టీఆర్ అసెంబ్లీని బహిష్కరించిన రీతిలోనే నేడు చంద్రబాబు బహిష్కరించారన్నారు. వైకాపా నేతలు వాడుతున్న బాష సరైంది కాదన్నారు. రాబోవు రోజుల్లో అధికార వైకాపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ప్రతిపక్షాలను తుడిచిపెట్టాలనే ఆలోచన తప్పు

ప్రతిపక్షాలను తుడిచిపెట్టాలనే ఆలోచన తప్పని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. కుప్పంలో 3 నెలలు ఉండి ఓటుకు రూ.10 వేలు పంచి ఎన్నికల్లో గెలుపొంది ఇప్పడు ప్రతి ఒక్కరూ కుప్పం గురించే మాట్లాడుతున్నారు. చంద్రబాబు మానసిక స్థైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎవరు, ఎక్కువ మాట్లాడితే వారికి ఎక్కువ మార్కులు వేస్తారనే ధోరణతో వైకాపా నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసులో మరిన్ని నిజాలు బయటకు రావాలని..,వివేకా హత్యపై రేపట్నుంచి అన్ని స్థాయిల్లో చర్చ పెడతామన్నారు.

నోరు విప్పితే బండ బూతులు

వైకాపా నేతలు నోరు విప్పితే బండబూతులు తిడుతున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వైకాపా నేతల వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోరా ? అని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రజాక్షేత్రంలో పని చేస్తామన్నారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు.

అసెంబ్లీ.. కౌరవ పాలనను తలపిస్తోంది

అసెంబ్లీ..కౌరవ పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ప్రతి మహిళా తలదించుకునేలా వైకాపా నేతల వైఖరి ఉందన్నారు. వైకాపా నేతలకూ తల్లి, చెల్లి, భార్య, పిల్లలు ఉన్నారు కదా ? అని నిలదీశారు. తెదేపా అధినేచ చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.

తెదేపా కార్యాలయానికి మహిళా కార్యకర్తలు

చంద్రబాబుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలతో మహిళా కార్యకర్తలు భారీగా తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చారు. తామంతా పార్టీతోనే ఉన్నామని తెదేపా మహిళల భారీ ఎత్తున నినాదాలు చేశారు. వారందరినీ సముదాయించిన చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబుకు మద్దతుగా గన్నవరం విమానాశ్రయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోకాళ్లపై కూర్చొని 'మేమంతా..నీ వెంటే..'అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

CHANDRABABU:'ఇది గౌర‌వ స‌భా..కౌరవ స‌భా'..: చంద్రబాబు

Last Updated :Nov 19, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details