ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PATTABHI COMMENTS: రాష్ట్ర ఆర్థిక లోటుకు జగన్ అవినీతే కారణం: పట్టాభి

By

Published : Nov 13, 2021, 5:04 PM IST

రాష్ట్ర ఆర్థిక లోటుకు జగన్ అవినీతే కారణమని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ఆర్థిక లోటు, అప్పుల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న ఆయన.. ఆరు నెలల్లోనే రూ.40 వేల కోట్లు అప్పు చేశారని దుయ్యబట్టారు.

రాష్ట్ర ఆర్థిక లోటుకు జగన్ అవినీతే కారణం
రాష్ట్ర ఆర్థిక లోటుకు జగన్ అవినీతే కారణం

ఆర్థిక లోటు, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉన్నందుకు ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సిగ్గుపడాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader Pattabi) ధ్వజమెత్తారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆర్థిక లోటు 662 శాతం పెరిగిందని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.37 వేల కోట్ల అప్పు సరిపోతుందని బడ్జెట్​లో (AP Budget) పేర్కొన్న ప్రభుత్వం.., తొలి ఆరు నెలల్లోనే రూ. 40వేల కోట్ల అప్పు చేసిందని దుయ్యబట్టారు. జగన్ అవినీతి కారణంగానే ఇంత భారీగా అప్పులు (Debts) చేస్తున్నా.. ఆర్థిక లోటు ఉంటోందని ఆరోపించారు. జగన్ అవినీతికి వచ్చిన డబ్బంతా ఆవిరైపోతుంటే ఇక రాష్ట్ర ఖజానాలో ఏముంటుందని ఆక్షేపించారు. వివిధ రాష్ట్రాల్లోని సంస్థలకు బకాయిలు (Pending Bills) చెల్లించనందుకు ఏపీపై రెడ్ నోటీసులు (Red notices) పెట్టినందుకు జగన్ సిగ్గుతో తలదించుకోవాలని పట్టాభి దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి దిల్లీలో ముఖం చాటేయకుండా రాష్ట్రానికి వచ్చి ఆర్థిక దివాళాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆరోగ్యాంధ్రను ఆనారోగ్యాంధ్రప్రదేశ్​గా మార్చేశారు: పంచుమర్తి

జగన్​కు (CM Jagan) ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఆరోగ్యాంధ్రను కాస్తా ఆనారోగ్యాంధ్రప్రదేశ్​గా మార్చారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ (Punchumarthi Anuradha) ఎద్దేవా చేశారు. ఏపీకి వైద్య పరికరాల ఉత్పత్తి చేసిన వారికి రూ. వేల కోట్ల బకాయిలు (Pending Bills) పెట్టినందుకు వైద్య పరికరాల జాతీయ యూనియన్ రాష్ట్రానికి రెడ్ నోటీసు (Red notices) జారీ చేయటం సిగ్గు చేటని విమర్శించారు. 100 శాతం ముందస్తు అడ్వాన్సులు (Advance) చెల్లిస్తేనే ఏపీకి వైద్య పరికరాలు (Medical equipment) పంపిణీ చేయాలని నిర్ణయించటంతో రాష్ట్రానికి దూది కూడా వచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (NTR Health University) నిధులు కొల్లగొట్టేందుకు జగన్ సిద్ధపడటం దుర్మార్గమన్నారు. కరోనాతో (Corona) లక్షలాది మంది చనిపోతే 14 వేల మందే అంటూ అసత్యాలు సృష్టించి కేంద్రాన్ని కూడా మభ్యపెడుతున్నారన్నారని ఆక్షేపించారు. రెండో దశ కరోనా ప్రారంభానికి ముందు క్వారంటైన్​కు (quarantaine) వెళ్లిన వైద్యారోగ్యశాఖ మంత్రి (AP Health Minister) ఎప్పుడు బయటకు వస్తారని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details