ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yanamala: లొసుగులు బయటపడ్డాయనే నాపై విమర్శలు: యనమల

By

Published : Mar 28, 2022, 2:01 PM IST

Yanamala fires on buggana: రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని.. తెదేపా నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆధారరహిత ఆరోపణలు తానెన్నడూ చేయలేదని.. ఆ అలవాటు తనకెప్పుడూ లేదన్నారు. లొసుగులు బయటపడ్డాయన్న అక్కసుతోనే.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

tdp leader yanamala ramakrishnudu fires on finance minister buggana rajendranath
'లొసుగులు బయటపడ్డాయనే ఆర్థిక మంత్రి నా మీద విమర్శలు చేస్తున్నారు': యనమల

Yanamala fires on buggana: రాష్ట్రంలో ఆర్టికల్ 360ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలన్న తన డిమాండ్లన్నీ హేతుబద్ధమైనవేనని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పారు. కాగ్‌లో ప్రస్తావించినవే తానూ చెప్పానని ఆయన స్పష్టం చేశారు. ఆధారరహిత ఆరోపణలు తానెన్నడూ చేయలేదని.. ఆ అలవాటు తనకెప్పుడూ లేదన్నారు. లొసుగులు బయటపడ్డాయన్న అక్కసుతోనే.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనపై విమర్శలు చేస్తున్నారని యనమల మండిపడ్డారు.

ప్రస్తుత ఆ‌ర్థికమంత్రి కాగ్ నోటింగ్స్​పై జవాబివ్వకుండా.. సంజాయిషీ చెప్పకుండా.. కావాలనే ఉద్దేశపూర్వకంగానే విస్మరించి.. కప్పదాటేశారని యనమల విమర్శించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందనేది రూఢీ అవుతోందన్నారు. సీఎఫ్ఎణ్ఎస్ (C.F.M.S) బైపాస్ చేయడం, ట్రెజరీ కోడ్ ఉల్లంఘన, ప్రత్యేక బిల్లుల పేరుతో అనుచిత రాటిఫికేషన్లు, అక్రమ బిల్లులు పాస్ చేసుకోవడానికి అవాంఛితంగా జీవో నెంబర్‌ 80 జారీ చేయడం వంటి లొసుగులన్నీ బయటపడేసరికి దిక్కుతోచకే ఎదురుదాడికి దిగారని ధ్వజమెత్తారు. ఏపీలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ విధించాలని, ఆర్టికల్ 360 తక్షణమే ప్రయోగించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పునరుద్ఘాటించారు. ఆర్థిక విధానాలపై ఆర్ధికమంత్రి బుగ్గనకు యనమల 12ప్రశ్నలు సంధించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details