ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమ్మఒడికి డబ్బులిచ్చి.. నాన్నబుడ్డితో లాక్కుంటున్నారు: యనమల

By

Published : May 12, 2021, 7:16 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేస్ అండ్ మీన్స్ ద్వారా వచ్చే నిధులను కరోనా వ్యాప్తి నియంత్రణకు ఖర్చు చేయాలని కోరారు.

tdp leader yanamala ramakrishnudu fire on ycp government
తెదేపా నేత యనమల రామకృష్ణుడు

వేస్ అండ్ మీన్స్ ద్వారా రాష్ట్రానికి రానున్న రూ. 2,146 కోట్ల నిధులను కరోనా నివారణకు, వ్యాక్సిన్ల కొనుగోళ్లకు ఖర్చు చేయాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ధరల పెంపు, పన్నులతో ప్రభుత్వం ప్రతి కుటుంబంపై రూ.2.5 లక్షలు భారం మోపిందని దుయ్యబట్టారు. అంబులెన్స్​ల కొనుగోళ్లలో రూ.307 కోట్లు అవినీతికి పాల్పడ్డారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మఒడి ద్వారా రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా రూ.36 వేలు, వాహన మిత్ర ద్వారా రూ.10 వేలు ఇచ్చి జరిమానాలు, ఇంధన ఛార్జీల రూపంలో రూ.30 వేలు గుంజుకుంటున్నారని యనమల ధ్వజమెత్తారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి, రైతు భరోసాకు రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని ఆక్షేపించారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించి ఆరు లక్షల మందికి ఇచ్చే నిరుద్యోగ భృతిని రద్దుచేశారని యనమల మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details