ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుంది: యనమల

By

Published : Mar 21, 2022, 5:24 PM IST

అధికంగా అప్పులు ఇచ్చే బ్యాంకులను కేంద్రమే కట్టడి చేయాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కోరారు. 2024 నాటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుంది
అప్పటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుంది

2024 నాటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుందని తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. 2024 నుంచి.. వడ్డీలకే ఏడాదికి లక్ష కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అన్నారు. వివిధ పథకాల లబ్దిదారులకు కేవలం రూ.9 వేల కోట్ల రూపాయలు మాత్రమే నేరుగా నగదు పంపిణీ చేసినట్టు బడ్జెట్ చూపారని.. కానీ ప్రభుత్వం మాత్రం 50 వేల కోట్ల రూపాయల మేర పేదలకు బదిలీ చేసినట్టు చెప్పుకుంటోందని ఆక్షేపించారు.

జగన్ ప్రభుత్వం డీబీటీల చెల్లింపులను ఎందుకు బడ్జెట్ లెక్కల్లో చూపలేకపోతోందని నిలదీశారు. గతంలో కార్పొరేషన్ ఆదాయంలో 90 శాతం మేర అప్పు తీసుకునే పరిస్థితి ఉంటే, ఇప్పుడు 180 శాతం మేర అప్పు తీసుకునేలా చట్ట సవరణ చేశారని... యనమల మండిపడ్డారు. అధికంగా అప్పులు ఇచ్చే బ్యాంకులను కేంద్రమే కట్టడి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details