ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రలోభాలను సైతం ఎదుర్కొని పోటీలో నిలిచారు.. ఎవరూ నిరుత్సాహపడొద్దు: చంద్రబాబు

By

Published : Mar 14, 2021, 7:16 PM IST

పురపాలక ఎన్నికల ఫలితాలపై తెదేపా శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నో ప్రలోభాలు, బెదిరింపులను సైతం ఎదుర్కొని గట్టి పోటీనిచ్చారన్నారు.

tdp chief chandrababu speaks on municipal elections results
ప్రలోభాలను సైతం ఎదుర్కొని పోటీలో నిలిచారు.. ఎవరూ నిరుత్సాహ పడొద్దు: చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు గట్టిగా పోరాడారని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెదేపా నేతలు, కార్యకర్తలు పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని.. వారి పోరాటస్ఫూర్తికి వందనాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల విషయానికి వస్తే.. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ట్విట్టర్​లో వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్

ABOUT THE AUTHOR

...view details