ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆయా జిల్లాల్లో మాస్కు లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు!

By

Published : Jun 15, 2020, 10:25 AM IST

లాక్​డౌన్​ సడలింపుల వల్ల కరోనా వైరస్​ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సందర్భంగా కరోన వైరస్​ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేస్తూ నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఆ ప్రాంతాల్లో ఉన్న తీవ్రతను బట్టి జరిమానాను ట్రాఫిక్​ పోలీసులు వసూలు చేస్తున్నారు.

state government imposing fines who are not wearing mask while coming to outside
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లాల్లో జరిమానాలు

కరోనా విస్తృతి దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా కనిపిస్తే ఆయా జిల్లాల్లో అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, కరోనా కేసుల తీవ్రతను బట్టి జరిమానాలను నిర్ణయిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, పట్టణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తుండగా.. ప్రకాశంలో గ్రామీణంలో రూ.25, పట్టణ ప్రాంతాల్లో రూ.50 వసూలు చేస్తున్నారు. కర్నూలు, తూర్పుగోదావరి మినహా మిగతా జిల్లాల్లోనూ ఈ విధానం ఉంది. అనంతపురం జిల్లా కేంద్రంలో మాత్రమే.. అది కూడా స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.200 విధిస్తున్నారు. ‘మాస్కు తప్పనిసరి’ అన్న సూచికలు ఏర్పాటు చేయని చిన్న దుకాణాలు రూ.500, పెద్ద దుకాణాలు రూ.వెయ్యి చెల్లించాల్సిందే. వసూళ్ల బాధ్యతను స్థానిక పరిస్థితులను బట్టి పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది చూసుకుంటున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లాల్లో జరిమానాలు

జిల్లాల్లో పరిస్థితి..

  • విశాఖ నగరంలో రూ.వెయ్యి జరిమానా విధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇంకా అమలు కావడం లేదు.
  • కడప జిల్లాలో కలెక్టర్‌ ఆదేశాల్లేకున్నా అమలు చేస్తున్నారు.
  • చిత్తూరు జిల్లాలో మాస్కు ధరించని వ్యక్తి నుంచి రూ.535 చొప్పున పోలీసులు వసూలు చేస్తున్నారు. తిరుపతిలో జరిమానా లేదు.
  • నెల్లూరు జిల్లా గ్రామాల్లో రూ.100, పట్టణాల్లో 200గా నిర్ణయించారు.
  • గుంటూరులో పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
  • పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే ఈ విధానం అమలులో ఉంది.
  • విజయనగరం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో రూ.200, గ్రామాల్లో రూ.100 విధిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details