ఆంధ్రప్రదేశ్

andhra pradesh

South central railway trains cancelled: 'ఈనెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు'

By

Published : Jan 24, 2022, 10:52 PM IST

South central railway trains cancelled: దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవలె ప్రకటించింది. కాగా 55 రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

South central railway trains cancelled
ఈనెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు

South central railway trains cancelled: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పలు ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే... ఈ రద్దును ఈనెల 31వ వరకు పొడగించినట్లు తాజాగా వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది.

రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..

  • కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు
  • కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్‌-ఉందానగర్ రైళ్లు రద్దు
  • మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లు రద్దు
  • తిరుపతి-కట్‌పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు
  • రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు
  • మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ రైళ్లు రద్దు
  • నర్సాపూర్-నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు

ఎంఎంటీఎస్‌లు రద్దు

ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసిన ద.మ. రైల్వే.. 24వ తేదీ కూడా 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌ - లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య నడిచే 16, సికింద్రాబాద్‌ - లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్‌లు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details