ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి

By

Published : Mar 18, 2021, 1:29 PM IST

vja_mayor

తీవ్ర ఉత్తంఠ నడుమ ఎట్టకేలకు విజయవాడ మేయర్​గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయరు పదవిని బీసీలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో రాయన భాగ్యలక్ష్మిని మేయర్ గా ఏకగ్రీవంగా ఎంపిక అయింది.

ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు విజయవాడ మేయర్‌ పదవి 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాయన భాగ్యలక్ష్మిని వరించింది. విజయవాడ నగరపాలక సంస్థ మేయరు పదవిని బీసీలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రాయన భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు. అధికారికంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ బుధవారం సాయంత్రం ప్రకటించారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌లు ఈమె పేరును ప్రతిపాదించారు. బండి పుణ్యశీల తనకు హామీ ఇచ్చారంటూ పట్టుబట్టినా.. బీసీలకు ఇవ్వాలని సీఎం చెప్పారంటూ సర్ది చెప్పారు. జనరల్‌ మహిళకు కేటాయించిన విజయవాడ మేయరు స్థానాన్ని బీసీలకు ఇచ్చామని వైకాపా ప్రకటించింది. దీంతో ఇవాళ విజయవాడ మేయర్​గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదీ చదవండి:అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం: నేడు సీఐడీ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే హాజరు

ABOUT THE AUTHOR

...view details