ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RRR: 'కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలి'

By

Published : Aug 24, 2021, 4:18 PM IST

'కేసుల నుంచి కడిగిన ముత్యంలా మా సీఎం బయటకు రావాలి' అని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి నరసాపురం ఎంపీ రఘురామ వ్యంగంగా వ్యాఖ్యానించారు. సీబీఐ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు సీఎం జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు.

mp raghu rama comments on cm jagan
mp raghu rama comments on cm jagan

'కేసుల నుంచి కడిగిన ముత్యంలా మా సీఎం బయటకు రావాలి'

సీబీఐ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు సీఎం జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 'కేసుల నుంచి కడిగిన ముత్యంలా మా సీఎం బయటకు రావాలి' అని కోరుకుంటున్నట్లు రఘురామ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా..రహదారుల పరిస్థితిపై జగన్ తీవ్రంగా విమర్శించారని.. కానీ ఇప్పుడు అసలు రోడ్లే లేని దుస్థితి ఏర్పడిందన్నారు.

కేసుల నుంచి కడిగిన ముత్యంలా మా సీఎం బయటకు రావాలి. ఎన్నికల ప్రచారంలో రోడ్ల దుస్థితిపై మా సీఎం బాగా చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్లు బాగోలేదని అప్పుడు చెప్పారు.. ఇప్పుడు రోడ్లే లేవు. రోడ్లు బాగాలేక వృద్ధులు, గర్భిణులకు అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో చేసిన ఉపాధిహామీ పనులకే బిల్లులు ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చినా రాష్ట్రం మాత్రం నరేగా బిల్లులు చెల్లించడం లేదు. -రఘురామ, నరసాపురం ఎంపీ

ABOUT THE AUTHOR

...view details