ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నాడు అభివృద్ధిని విస్మరించి.. నేడు ఓట్లు అడుగుతున్నారు'

By

Published : Feb 21, 2021, 3:20 PM IST

గత ఐదేళ్ల తెదేపా పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. నాడు అభివృద్ధిని విస్మరించిన తెదేపా నాయ‌కులు.. నేడు ఓట్లు అడిగేందుకు వ‌స్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

నాడు అభివృద్ధిని విస్మరించి..నేడు ఓట్లు అడుగుతున్నారు
నాడు అభివృద్ధిని విస్మరించి..నేడు ఓట్లు అడుగుతున్నారు

గ‌త ప్రభుత్వ హ‌యాంలో కార్పొరేట‌ర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు దోచుకోవ‌టమే ల‌క్ష్యంగా ప‌నిచేశార‌ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్​లో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఐదేళ్ల తెదేపా పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. నాడు అభివృద్ధిని విస్మరించిన తెదేపా నాయ‌కులు.. నేడు ఓట్లు అడిగేందుకు వ‌స్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

క‌రోనా కష్ట కాలంలోనూ అభివృద్ధే ల‌క్ష్యంగా జ‌గ‌న్‌ పాల‌న సాగించారని కొనియాడారు. విజయవాడ 12వ డివిజన్​లో వైకాపా తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజాదరణ చూసి ఓటమి పాలవుతామనే భయం తెదేపా అభ్యర్థుల్లో నెలకొందని విమర్శించారు. విజయవాడలోని అన్ని మున్సిపల్ డివిజన్లను వైకాపా సొంతం చేసుకుంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details