ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vellampalli Comments: ప్రతిపక్ష నేతలు హద్దు మీరితే... ఘాటుగా స్పందిస్తాం: మంత్రి వెల్లంపల్లి

By

Published : Dec 30, 2021, 1:22 PM IST

Vellampalli on Vangaveeti protection: ప్రతిపక్ష నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే అంతకంటే ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు.

Vellampalli on political leaders comments
హద్దు దాటితే...ఘాటుగా స్పందించాల్సి ఉంటుంది

Vellampalli on Vangaviti protection: ప్రతిపక్ష నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే అంతకంటే ఘాటుగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. లాలూచిపడ్డ తెదేపా, జనసేన నేతలకు తమను వివర్శించే హక్కులేదన్నారు. వంగవీటి రాధా తనకు రక్షణ లేదని ప్రకటించిన వెంటనే.. ముఖ్యమంత్రే స్వయంగా స్పందించి ఆయనకు భద్రతను కేటాయించారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్​లో బీటీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

హద్దు దాటితే...ఘాటుగా స్పందించాల్సి ఉంటుంది

ABOUT THE AUTHOR

...view details