ETV Bharat / city

Cinema Theaters Open: సీజ్​ చేసిన థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి

Cinema Theaters open
Cinema Theaters open
author img

By

Published : Dec 30, 2021, 11:12 AM IST

Updated : Dec 30, 2021, 12:22 PM IST

11:07 December 30

థియేటర్లకు తాత్కాలిక ఊరట

థియేటర్లకు తాత్కాలిక ఊరట

One month permission to Cinema Theaters: సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన 83 థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. దీనికోసం జిల్లా జాయింట్ కలెక్టర్‌ (జేసీ)కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. ఆయా థియేటర్లు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెలరోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని చెప్పారు.

సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్‌ యజమానులు ఈ రోజు మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలోని అయన కార్యాలయంలో కలిశారు. కొన్ని విషయాలు వ్యక్తిగతంగా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చానని నారాయణమూర్తి తెలిపారు

ఇదీ చదవండి:

Cinema Tickets Issue: సినిమా టికెట్ల వ్యవహారంపై కొత్త కమిటీ నియామకం

Last Updated : Dec 30, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.