ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇదే..

By

Published : Feb 7, 2022, 10:55 PM IST

TS Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్మీడియట్​ పరీక్షలకు షెడ్యూల్​ ఖరారైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నెలలోనే జరగనున్నాయి. మే నెలలో పరీక్షలు జరపాలని భావించినప్పటికీ.. ముందుగానే షెడ్యూలు ఖరారు చేశారు.

Inter exam schedule released in telangana
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇదే

TS Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్మీడియట్​ పరీక్షలకు షెడ్యూల్​ ఖరారైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నెలలోనే జరగనున్నాయి. మే నెలలో పరీక్షలు జరపాలని భావించినప్పటికీ.. ఏప్రిల్ 20 నుంచి పరీక్షల షెడ్యూలు ఖరారు చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు మొదటి సంవత్సరం.. ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన పరీక్షలు మే 5 నాటికే ముగియనున్నాయి. అప్పటికి ఎండ తీవ్రత పెరగనున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

70 శాతం సిలబస్​ నుంచే..
రెండో సంవత్సరం విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ విద్య పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది కూడా 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నాయి. ప్రశ్నల్లో ఛాయిస్, ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలపై ఇంటర్ బోర్డు ఇంకా స్పష్టతనివ్వలేదు. పరీక్షల్లో గతేడాది కన్నా ఎక్కువగా ఛాయిస్ ఇవ్వాలని.. చదువుతున్న కాలేజీలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

పదో తరగతి పరీక్షలు అప్పుడే..
ఇంటర్ ప్రధాన పరీక్షలు మే 5న ముగియనున్నందున.. పదో తరగతి పరీక్షలు మే 6 లేదా 7న ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్ జూన్ నెలాఖరున జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎంసెట్ జరిపేందుకు ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత 45 రోజుల సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details