ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fee: ఫీజు నియంత్రణ జీవోలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు

By

Published : Sep 15, 2021, 4:17 PM IST

రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన 53, 54 జీవోలపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

high court hearings over fee issues
ఫీజు నియంత్రణ జీవోలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు

రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో రుసుములు ఖరారు చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన 53, 54 జీవోలపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ జీవోలను సవాలు చేస్తూ.. తూర్పుగోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సహా మరికొన్ని విద్యాసంస్థలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వల్ల.. తీవ్రంగా నష్టపోతామని తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములపై అభ్యంతరం ఉంటే.. ఆ విషయాన్నితమ దృష్టికి తెచ్చే వెసులుబాటు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు ఇచ్చామని.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తరపు న్యాయవాది వాదించారు. అపరిపక్వమైన దశలో వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. అధిక మొత్తంలో ఫీజుల వసూళ్లను నియంత్రించే బాధ్యత.. కమిషన్‌పై ఉందన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details