ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోలుకున్న గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్

By

Published : Nov 19, 2021, 9:44 PM IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం మెరుగు పడిందని రాజ్ భవన్ అధికారులు తెలిపారు. ఏఐజీ ఆసుపత్రికి చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.

governor health update
governor health update

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యం మెరుగు పడిందని రాజ్ భవన్ అధికారులు తెలిపారు. కరోనాతో ఈనెల 17న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గవర్నర్ కోలుకున్నట్లు తెలిపారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాణాధారాలను కొనసాగిస్తున్నారని, ప్రత్యేక వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని సిసోడియా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details