ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దేశ నిర్మాణంలో మహిళలది కీలక భూమిక: గవర్నర్ బిశ్వభూషణ్

By

Published : Mar 7, 2021, 8:25 PM IST

మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని..రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిగా, గృహిణిగా మహిళలు అందించే సేవలు వెలకట్టలేనివని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

governer bishwabushan wishes to women on womens day
మహిళలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని పేర్కొన్నారు. మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.

కరోనాపై పోరులో సైతం.. ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని ప్రశంసించారు. మహిళలు ఎంతో సహనంతో తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి అని తెలిపారు. జాతి నిర్మాణంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారన్నారు.

మహిళలు అందించే సేవలు వెలకట్టలేనివి: పవన్ కల్యాణ్

మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే.. వారు రాణించని రంగమంటూ ఉండదని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తులందరికీ.. జనసేన తరపున శుభాకాంక్షలు తెలిపారు. తల్లిగా, గృహిణిగా మహిళలు అందించే సేవలు వెల కట్టలేనివని కొనియాడారు.

ఇదీ చదవండి:

ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

TAGGED:

ABOUT THE AUTHOR

...view details