ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుం లేదన్న దేవదాయ శాఖ కమిషనర్

By

Published : Aug 28, 2022, 5:39 PM IST

COMMISSIONER OF ENDOWMENT DEPARTMENT గణేశ్ మండపాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని దేవదాయ శాఖ కమిషనర్ జవహర్‌లాల్‌ స్పష్టం చేశారు. రుసుం వసూలు చేస్తున్నారని దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఎవరైనా రుసుం వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

COMMISSIONER OF ENDOWMENT DEPARTMENT
COMMISSIONER OF ENDOWMENT DEPARTMENT

Endowment Commissioner on Ganesh Stages: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్​లాల్ స్పష్టం చేశారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. మండపాలు ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని, చట్టపరంగా తీసుకోవలసిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలన్నారు. ఎక్కడైనా మండపాలకు రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

BJP leader Somu Veerraju fire: విఘ్నాధిపతి వేడుకలకు విఘ్నాలా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్​ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పండుగ జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైకాపా ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడ్డారు.

ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని డీజీపీ ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను, ఉత్సవ సమితి సభ్యులను వేధిస్తూ.. ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలకు దరఖాస్తు చేసిన వెంటనే సింగిల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details