ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలోని ఇల్లందు సింగరేణి గనుల్లో 'ఆచార్య' చిత్రబృందం

By

Published : Feb 12, 2021, 4:35 PM IST

'ఆచార్య' సినిమా షూటింగ్​కి అనువైన ప్రదేశాలను గుర్తించే పనిలో డైరెక్టర్ కొరటాల శివ ఉన్నారు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఉపరితల గని, భూగర్భ గనులను ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి చిత్రబృందం పరిశీలించింది.

acharya movie shooting updates
తెలంగాణలోని ఇల్లందు సింగరేణి గనుల్లో 'ఆచార్య' చిత్రబృందం

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఉపరితల గని, భూగర్భ గనులను 'ఆచార్య' సినిమా షూటింగ్ నిమిత్తం సినీ డైరెక్టర్ కొరటాల శివ పరిశీలించారు. ఎమ్మెల్యే హరిప్రియ, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సింగరేణి అధికారుతో కలిసి వీక్షించారు.

భూగర్భగనిలోకి దిగి షూటింగ్​కి అనువైన ప్రదేశాలు, అనుకూల అంశాలను చిత్రబృందం పరిశీలించింది. ఉపరితల గని ప్రాంతాలను చూశారు. సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​తో దర్శకుడు సమావేశం అయ్యారు. సింగరేణి అధికారుల అనుమతితో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: ఎస్‌ఈసీని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు: కొడాలి నాని

ABOUT THE AUTHOR

...view details