ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తా అని ఎందుకు చెప్పడం లేదు - సీపీఐ రామకృష్ణ

By

Published : Jun 16, 2022, 5:31 PM IST

CPI RAMAKRISHNA: రాష్ట్రంలో రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితి ఎందుకు వచ్చిందో సీఎం ఆలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ మోసం చేశారన్నారు. కేవలం కొంతమంది రైతులకు పంట నష్టం ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని ప్రశ్నించారు. రైతులతో కలిసి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు.

CPI RAMAKRISHNA
ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తా అని జగన్ ఎందుకు చెప్పడం లేదు

ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తా అని జగన్ ఎందుకు చెప్పడం లేదు

CPI RAMAKRISHNA: ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ మౌనంగా ఉంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితి ఎందుకు వచ్చిందో సీఎం ఆలోచించాలన్నారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని గతంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం వైకాపా అవసరం భాజపాకు ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తా అని జగన్ ఎందుకు చెప్పడం లేదన్నారు. జగన్​ని నమ్మి గెలిపిస్తే.. తమ సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా ,వైకాపాలు రాష్ట్రపతి ఎన్నికలో ఎటు ఉంటారో చెప్పాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ మోసం చేశారన్నారు. కేవలం కొంతమంది రైతులకు పంట నష్టం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. రైతులతో కలిసి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details