ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా రివర్స్‌ గేర్‌లో పాలిస్తోంది : రామకృష్ణ

By

Published : Jan 3, 2022, 4:52 PM IST

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ గేర్​లో పరిపాలన చేస్తోందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna fires on ycp leaders
ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో పరిపాలన చేస్తోంది: రామకృష్ణ

ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో పరిపాలన చేస్తోంది: రామకృష్ణ

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ గేర్ లో పరిపాలన చేస్తోందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మంత్రులు కూడా రివర్స్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు తీసుకోవడం తప్పు అని విమర్శించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.. నేడు అప్పుల కోసం దిల్లీలో తిష్ట వేశారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైకాపా నేతలకు సవాల్ విసిరారు. పన్నుల పెంపు అంశంలో మంత్రి బొత్స పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి.. అదేదో గొప్ప పనిగా చెప్పుకుంటూ ప్రతిపక్షాలను విమర్శించడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details