ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విపక్ష సభ్యుల్ని తిట్టేందుకే.. అసెంబ్లీ నిర్వహించారా?: సీపీఐ రామకృష్ణ

By

Published : Mar 26, 2022, 5:22 PM IST

రాష్ట్ర చరిత్రలో ఇంత ఘోరంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్నడూ జరగలేదని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. సభ ప్రతిష్టను దిగజార్చారని.. ప్రజాసమస్యలపై చర్చే లేదని మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలు, ప్రతిపక్ష సభ్యుల్ని తిట్టేందుకే అసెంబ్లీ నిర్వహించారా? అని నిలదీశారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

శాసనసభ సమావేశాలు ఇంత ఘోరంగా ఎప్పుడూ జరగలేదని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అధికార పార్టీ సభ్యులు సభ హుందాను దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు, పరిష్కారాలపై చర్చించకుండా సభా సమయాన్ని వృథా చేశారన్నారు. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకున్నారన్న ఆయన.. ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టులు చేయిస్తారా? అని మండిపడ్డారు.

న్యాయస్థానాలను కూడా తప్పుబట్టి నోటికొచ్చినట్లు మాట్లాడటమేంటని ముఖ్యమంత్రి జగన్​ను నిలదీశారు. సభాపతి తమ్మినేని సీతారాం స్పీకర్ కుర్చీకి ఉన్న హూందాతనాన్ని కాలరాస్తున్నారని.. మంత్రి పదవి కోసం స్పీకర్ పదవిని దిగజార్చారని విమర్శించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో చేపట్టిన సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలని రామకృష్ణ కోరారు.

ఇదీచదవండి: రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి.. జగన్‌ కంకణం కట్టుకున్నారు: లోకేశ్‌

ABOUT THE AUTHOR

...view details