ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Ramakrishna: 'పెళ్లైనా ఆరు నెలల తర్వాత శుభలేఖ ప్రచురించినట్లు..'

By

Published : Mar 7, 2022, 10:19 AM IST

CPI Ramakrishna: అశుతోష్ మిశ్రా నివేదికను ప్రభుత్వం ఇప్పుడు బయటపెట్టడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లైనా ఆరు నెలల తర్వాత శుభలేఖ ప్రచురించినట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆ నివేదిక ఇప్పుడెందుకు బయట పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

cpi leader ramakrishna fires on govt over prc issue
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

CPI Ramakrishna: పెళ్లి తర్వాత ఆరు నెలల తర్వాత శుభలేఖ ప్రచురించినట్లుగా.. అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయటపెట్టారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆక్షేపించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరో దఫా చర్చలు జరపాలని కోరారు. అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం.. 27 శాతం ఫిట్​మెంట్ ఇచ్చి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

అశుతోష్​ మిశ్ర నివేదికలో ఏముంది..

Ashutosh Mixed Committee Report: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పని చేయాలంటే ఖాళీ అవుతున్న పోస్టులను గుర్తించి, ప్రతి ఏటా భర్తీ చేయాల్సిందేనని అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్యాలయాలు ఒక పద్ధతి ప్రకారం, సమర్థంగా పని చేయాలంటే ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం ముఖ్యమని పేర్కొంది. ఏళ్ల తరబడి ఖాళీలను నింపకుండా.. ఒకేసారి వాటిని భర్తీ చేస్తే రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. దీనివల్ల ఒకేసారి ఉద్యోగాల భర్తీ, ఒకేసారి పదవీ విరమణ వంటి పరిస్థితులు ఏర్పడతాయని వివరించింది. ‘ప్రతి ప్రభుత్వశాఖా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా దీన్ని నవీకరించి, ఎప్పుడు ఎన్ని ఖాళీలు వస్తున్నాయన్న సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి. పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలపై కూడా స్పష్టత ఉండాలి. ఏపీపీఎస్సీ ద్వారా లేదా జిల్లా ఎంపిక కమిటీల సాయంతో లేదా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని అశుతోష్‌ కమిటీ కుండ బద్దలు కొట్టింది.

ఉద్యోగాల ఖాళీల వల్ల పనితీరుపై ప్రభావం పడుతోందని, ఇది ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోందంటూ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అనేక అభ్యర్థనలను కమిటీ అందుకుందని తెలిపింది. ప్రధానంగా జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరోవైపు సరైన సేవలందక ప్రజలూ అసంతృప్తితో ఉంటున్నారని ఉద్యోగులు పేర్కొన్నట్లు నివేదికలో వెల్లడించారు.

తన దృష్టికి వచ్చాయంటూ కమిటీ ప్రస్తావించిన అంశాలివీ..

  • ప్రధానంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పశుసంవర్థకం, వ్యవసాయ, భూ పరిపాలన శాఖల్లో 20శాతానికి మించి ఖాళీలు ఉన్నాయి.
  • వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
  • ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోనూ భారీగా ఖాళీలున్నా భర్తీ చేయడం లేదు.
  • ఏఈ, ఏఈఈ వంటి ఉద్యోగులున్నా వారికి సాయం అందించాల్సిన సిబ్బంది కొరత ఉంటోంది.
  • వైద్య ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల పని భారం పెరగడంతో పాటు సెలవులూ వినియోగించుకోలేని పరిస్థితి ఉంది.
  • సర్వే ఉద్యోగులకూ అధిక పని ఒత్తిడి ఉంది.
  • రెవెన్యూలో పని భారానికి, సిబ్బందికీ సంబంధం లేకుండా ఉంది.

ఇదీ చదవండి:

ASHUTOSH MISHRA REPORT: పీఆర్సీ అదనపు భారం రూ.3,181 కోట్లే.. సర్కారు లెక్క రూ. 11,707 కోట్లు..!

ABOUT THE AUTHOR

...view details