ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tulasi Reddy: మోదీ ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టాలి: తులసిరెడ్డి

By

Published : Mar 3, 2022, 2:23 PM IST

Congress on Amaravati: సీఆర్డీఏ రద్దు చట్టంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు. మూడు సంవత్సరాలు అయినా నేటికీ ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

APCC Working president comments
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

APCC Working president: సీఆర్డీఏ రద్దు చట్టంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని కాంగ్రెస్​ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్ట ప్రకారం ఎంత ఖర్చు అయినా కేంద్ర ప్రభుత్వమే భరించాలని హైకోర్టు సూచించిందన్నారు. ఈ విషయంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు. మూడు సంవత్సరాలైనా నేటికీ ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టాలని, లేకపోతే వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని సూచించారు. వివేకా హత్య కేసులో నిందితులని కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిని సీబీఐ సైతం విచారించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details